| Audio
|
Reference
|
Text
|
|
|
Matthew
1:1
|
అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి.
|
|
|
Matthew
1:2
|
అబ్రాహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను
|
|
|
Matthew
1:3
|
యూదా తామారు నందు పెరెసును, జెరహును కనెను. పెరెసు ఎస్రోమును కనెను.
|
|
|
Matthew
1:4
|
ఎస్రోము ఆరామును కనెను ఆరాము అమ్మినాదాబును కనెను. అమ్మినాదాబు నయస్సోనును కనెను.
|
|
|
Matthew
1:5
|
నయస్సోను శల్మానును కనెను, సల్మాను రాహబు నందు బొయజును కనెను, బోయజు రూతు నందు ఓబేదును కనెను, ఒబేదు యెష్షయిని కనెను, యెష్షయ దావీదును కనెను
|
|
|
Matthew
1:6
|
ఊరియా బార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలోమోను ను కనెను.
|
|
|
Matthew
1:7
|
సొలోమోను రెహబామును కనెను రెహాబాము అబీయానును కనెను. అబీయా ఆసాను కనెను.
|
|
|
Matthew
1:8
|
ఆసా యొహోషాపాతును కనెను యొహోషాపాతు యొహోరామును కనెను యొహోరాము ఉజ్జియాను కనెను.
|
|
|
Matthew
1:9
|
ఉజ్జియా యోతామును కనెను యోతాము ఆహాజును కనెను. ఆహాజు హిజ్కియాను కనెను
|
|
|
Matthew
1:10
|
హిజ్కియా మనష్షేను కనెను మనష్షే ఆమోసును కనెను ఆమోసు యోషియాను కనెను;
|
|
|
Matthew
1:11
|
యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషియా యొకన్యాను అతని సహోదరులను కనెను.
|
|
|
Matthew
1:12
|
బబులోనుకు కొని పోబడిన తరువాత యొకన్యా షయల్తీ యేలును కనెను అయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను
|
|
|
Matthew
1:13
|
జెరుబ్బాబెలు అబీహూదును కనెను అబీహూదు ఎల్యాకీ మును కనెను ఎల్యాకీము అజోరును కనెను
|
|
|
Matthew
1:14
|
అజోరు సాదోకును కనెను సాదోకు ఆకీమును కనెను ఆకీము ఎలీహూదును కనెను.
|
|
|
Matthew
1:15
|
ఎలీహూదు ఎలియాజ రును కనెను ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను
|
|
|
Matthew
1:16
|
యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను.
|
|
|
Matthew
1:17
|
ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరముల న్నియు పదు నాలుగు తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొని పోబడిన కాలము వరకు పదునాలుగు తరములు; బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తువరకు పదునాలుగు తరములు.
|
|
|
Matthew
1:18
|
యేసు క్రీస్తు జనన విధ మెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపుకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా నుండెను
|
|
|
Matthew
1:19
|
ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపర్చనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ నుద్దేశించెను
|
|
|
Matthew
1:20
|
అతడు యీసంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైనమరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది
|
|
|
Matthew
1:21
|
అమె యొక కుమారుని కనును; తనప్రజలను వారి పాపములనుండి ఇ ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదవనెను.
|
|
|
Matthew
1:22
|
ఆలకించుడి, కన్యక గర్భవతి యై కుమారుని కనును; ఆయనకు ఇమమానుయేలను పేరు పెట్టును
|
|
|
Matthew
1:23
|
అని ప్రభువు తన ప్రవక్త ద్వారాపలికిన మాట నెరవేరు నట్లు యిదియంతయు జరిగెను. ఇమమానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని యర్ధము.
|
|
|
Matthew
1:24
|
యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, తన భార్యను చేర్చుకొని
|
|
|
Matthew
1:25
|
ఆమె కుమారుని కను వరకు ఆమెను యెరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను.
|